పర్యాటక కేంద్రంలో అన్ని వసతులు కల్పించాలి: ఎమ్మెల్యే వేగేశన

55చూసినవారు
పర్యాటక కేంద్రంలో అన్ని వసతులు కల్పించాలి: ఎమ్మెల్యే వేగేశన
కార్తీకమాసం సందర్భంగా సూర్యలంక సముద్ర పర్యాటక కేంద్రానికి వచ్చే భక్తులకు ఎటువంటి ఇబ్బందులు లేకుండా అన్ని ఏర్పాట్లు చేయాలని బాపట్ల ఎమ్మెల్యే వేగేశన నరేంద్ర వర్మ అధికారులకు సూచించారు. తీసుకోవాల్సిన చర్యలపై శుక్రవారం బాపట్ల మున్సిపల్ కార్యాలయంలో వివిధ శాఖల అధికారులతో సమీక్ష నిర్వహించారు. పటిష్ట నిఘా, భద్రతా చర్యలు మౌలిక వసతులు కల్పించాలన్నారు. కమిషనర్ రఘునాథ రెడ్డి, వివిధ శాఖల అధికారులు పాల్గొన్నారు.

సంబంధిత పోస్ట్