బాపట్ల పట్టణంలో శుక్రవారం ఏపీ గ్రామ, వార్డు వాలంటీర్స్ యూనియన్ సిఐటియు ఆధ్వర్యంలో తహశీల్దార్ కార్యాలయం వద్ద ఆందోళన చేపట్టారు. వాలంటీర్ వ్యవస్థను కొనసాగించాలని, ఎన్నికల్లో కూటమి ప్రభుత్వం ఇచ్చిన హామీలు రూ. 10వేల వేతనంతో పాటు 6 నెలల బకాయిలు ఇవ్వాలని వారు ఆందోళన చేశారు. అనంతరం తహశీల్దార్ షేక్ సలీమా కు వినతి పత్రం అందించారు. వాలంటీర్లతో పాటు సిఐటియు నాయకులు పాల్గొన్నారు.