భారత రాజ్యాంగ ఆమోద దినోత్సవం సందర్భంగా మంగళవారం బాపట్ల జిల్లా మాజీ సైనిక సంక్షేమ సంఘం అధ్యక్షులు ఎంపీటీసీ తాండ్ర సాంబశివరావు ఆధ్వర్యంలో మాజీ సైనికులు పట్టణం లోఅంబేద్కర్ విగ్రహానికి పూలమాలల వేసి నివాళులు అర్పించారు. ఎంపీటీసీ తాండ్ర మాట్లాడుతూ ప్రపంచంలోనే అత్యంత శక్తివంతమైన , సర్వ శ్రేష్ఠ మైన రాజ్యాంగాన్ని భారతీయులకు అందించిన ప్రపంచ మేధావి అంబేద్కర్ కి భారతీయులు అందరూ రుణపడి ఉంటారని కొనియాడారు.