సుప్రీం కోర్టు ఆదేశాలను సైతం పట్టించుకోకుండా బాపట్ల వెదుళ్ళపల్లి గ్రామం శివారులో శుక్రవారం యథేచ్చగా అక్రమ ఇసుక తవ్వకాలను కొనసాగిస్తున్నారు. అనుమతులు లేకుండా గత మూడు రోజుల నుంచి ఇసుక తవ్వకాలు జరుపుతున్న అధికారులు పట్టించుకోవటం లేదని స్థానిక ప్రజలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. గత గురువారం బధిరుల పాఠశాల వెనకాల తవ్వకాలపై అధికారులు విచారించి వెళ్లిపోయారు. మరల ఇసుక తవ్వకాలు జరపటం గమనార్హం.