రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు వచ్చే నెల 7వ తేదీన బాపట్ల జిల్లాలో పర్యటించనున్నారు. ఈ సందర్భంగా బాపట్ల జిల్లా కలెక్టరేట్ సమావేశ మందిరంలో కలెక్టర్ వెంకట మురళి ఆధ్వర్యంలో ముందస్తుగా పర్యటన ఏర్పాట్లపై వివిధ శాఖల అధికారులతో సమావేశం ఏర్పాటు చేశారు. శాఖల వారీగా చేయవలసిన ముందస్తు ఏర్పాట్లపై వివరించి సమన్వయంతో ముఖ్యమంత్రి పర్యటన విజయవంతం చేయాలని కోరారు.