బాపట్ల: పలు వార్డుల్లో మున్సిపల్ కమిషనర్ సుడిగాలి పర్యటన

76చూసినవారు
బాపట్ల: పలు వార్డుల్లో మున్సిపల్ కమిషనర్ సుడిగాలి పర్యటన
బాపట్ల మున్సిపల్ కమిషనర్ రఘునాధ రెడ్డి గురువారం పలువార్డుల్లో సుడిగాలి పర్యటన చేశారు. అకాల వర్షాల కారణంగా వార్డుల్లో నిలిచిపోయిన నీరు పరిశీలించారు. ప్రజల సమస్యలను అడిగి తెలుసుకున్నారు. మార్కెట్, 3, 7 వార్డులు, రాజీవ్ గాంధీ నగర్, యానాది కాలనీ, ఇందిరానగర్ ప్రాంతాలలో పర్యటించారు. వార్డుల్లో పారిశుధ్యం సమస్య తలెత్తకుండా చర్యలు చేపట్టాలని సిబ్బందిని ఆదేశించారు. శానిటరీ ఇన్స్పెక్టర్ శ్రీనివాసరావు పాల్గొన్నారు.
Job Suitcase

Jobs near you

సంబంధిత పోస్ట్