బాపట్ల: అత్యాచారయత్నానికి గురైన పాపను పరామర్శించిన పల్లం

72చూసినవారు
బాపట్ల: అత్యాచారయత్నానికి గురైన పాపను పరామర్శించిన పల్లం
బాపట్ల పట్టణం 11వ వార్డు రాజీవ్ నగర్ కాలనీకి చెందిన చిన్నారి సోమవారం అత్యాచారయత్నానికి గురైంది. పాపను ప్రభుత్వాసుపత్రిలో చేర్పించారు. సమాచారం అందుకున్న బాపట్ల పార్లమెంటరీ మహిళా ప్రధాన కార్యదర్శి పల్లం సరోజిని పాపను పరామర్శించారు. చరవాణిలో ఎమ్మెల్యే వేగేశనకు సమాచారం ఇవ్వగా మెరుగైన వైద్యం అందించాలని నిందితుడిని కఠిన శిక్షించాలని ఆయన పోలీసులకు సూచించినట్లు పల్లం సరోజిని తెలిపారు.

సంబంధిత పోస్ట్