బాపట్ల జిల్లా ఇన్ చార్జ్ మంత్రి, రాష్ట్ర సమాచార పౌర సంబంధాల శాఖ మంత్రి కొలుసు పార్థసారధిని మంగళవారం డిఆర్సి మందిరంలో జర్నలిస్టులు కలిశారు. జర్నలిస్టులకు నివేశన స్థలాలు ఇవ్వాలని, వర్కింగ్ జర్నలిస్టుల అందరికీ అక్రిడేషన్ కార్డులు మంజూరు చేయాలని, హెల్త్ కార్డులు పనిచేసే విధంగా చర్యలు చేపట్టాలని వివిధ సమస్యలపై వినతిపత్రం అందించారు. ఈ సందర్భంగా మంత్రి జర్నలిస్టుల సమస్యలు పరిష్కరిస్తానని హామీ ఇచ్చారు.