బాపట్ల మండల పరిధిలోని పోతురాజు కొత్తపాలెంలో ఉన్న ఎత్తిపోతల పథకం నుంచి నీరు లీక్ అవుతుంది. దీంతో పథకానికి దగ్గరలో ఉన్న ఇళ్లల్లోకి నీళ్లు వచ్చాయి. గతంలో కూడా ఒకసారి ఇలానే జరిగితే అధికారులు తేలికపాటి మరమ్మతులు చేసి వెళ్లారని, పథకానికి సమీపంలో విద్యుత్ ట్రాన్స్ఫర్ లు కూడా ఉండడంతో స్థానికుల భయంతో గడుపుతున్నారు. అధికారులకు ఫిర్యాదు చేసిన పట్టించుకోవట్లేదని వాపోయారు. ఇకనైనా స్పందించాలని వారు కోరుతున్నారు.