ప్రతి ఒక్కరూ ఆధార్ కార్డు కలిగి ఉండాలని తద్వారా ప్రభుత్వ బహుళ ప్రయోజనాలు పొందేందుకు అవకాశం ఉంటుందని కర్లపాలెం ఎంపీడీవో శ్రీనివాసరరావు అన్నారు. శుక్రవారం మండలంలోని పాత నందాయపాలెం, ధమ్మన వారిపాలెం గ్రామాల లోని ఆధార్ నమోదు కార్యక్రమాన్ని పరిశీలించారు. ఆధార్ ప్రయోజనాలు ప్రజలకు వివరించారు. తెదేపా నేత తిరువీధుల శంకర్ ప్రసాద్, కూటమి శ్రేణులు, గ్రామ సచివాలయ సిబ్బంది పాల్గొన్నారు.