కర్లపాలెం మండలం కొత్త నందాయపాలెం గ్రామంలోని దుర్గ భవాని అమ్మవారి ఆలయ హుండీ మరియు అమ్మవారి నగలు శుక్రవారం తెల్లవారుజామున దుండగులు అపహరించిన విషయం తెలిసిందే. అయితే అధికారులు స్పందించి దర్యాప్తు ముమ్మరం చేశారు. హుండీ పై ఉన్న వేలిముద్రలను శుక్రవారం మధ్యాహ్నం క్లూస్ టీం సేకరించారు. మరిన్ని వివరాలు తెలియాల్సి ఉంది.