కర్లపాలెం మండలంలోని సమ్మెటవారి పాలెం పంచాయితీలోని శీలం వారి పాలెంలో పార్లిమ్మ తల్లి గుడి వద్ద కార్తీకమాసం పురస్కరించుకొని బుధవారం అమ్మవారికి ప్రత్యేక పూజలు నిర్వహించారు. పూజలు అయిన తర్వాత అయ్యప్ప స్వాములు, భవాని మాతలు, గ్రామ ప్రజలు భజన కార్యక్రమాలు నిర్వహించారు. భజన కార్యక్రమం అనంతరం స్వాములకు చద్ది, గ్రామస్థులకు భోజనాలు ఏర్పాటు చేసారు.