కొరిశపాడు మండలం మేదరమెట్ల గ్రామానికి చెందిన జిల్లా జై గౌడ్ ఉద్యమ సంఘం అధ్యక్షులు మోరపాకుల లక్ష్మణస్వామి గౌడ్ ఆదివారం బాపట్లలో శ్రీ కంట మహేశ్వర స్వామి కాటమయ్య కార్తీక వనభోజనాల కార్యక్రమంలో పాల్గొన్నారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా హాజరైన జై గౌడ్ ఉద్యమ సంఘం జాతీయ అధ్యక్షులు వట్టికూటి రామారావు గౌడ్ ను లక్ష్మణస్వామి సన్మానించారు. అనంతరం జిల్లా వ్యాప్తంగా గౌడ్ లు ఎదుర్కొంటున్న సమస్యలు అడిగి తెలుసుకున్నారు.