బాపట్ల పట్టణంలోని విజయలక్ష్మి పురం ఎల్ఈఎఫ్ చర్చి వద్ద గురువారం సాయంత్రం కోతులు బీభత్సం సృష్టించాయి. కాలనీలోని ఓ ఇంటి లోపలికి ప్రవేశించి మహిళపై దాడి చేయగా కిటికీ పగలగొట్టుకుని ఆ మహిళ బయటపడింది. గృహాల్లోకి చొరబడి చల్లా చెదలు చేసి మహిళపై దాడులు చేస్తున్నాయి. మున్సిపల్ అధికారులు కోతులు పడుతున్నామని చెప్పారు. కానీ నివారణ చర్యలు చేపట్టడం లేదని స్థానికులు ఆరోపిస్తున్నారు.