ఇంటింటిపై జాతీయ జెండా ఎగుర వేసే కార్యక్రమం జయప్రదంగా నిర్వహించాలని రాష్ట్ర ముఖ్య కార్యదర్శి నీరబ్ కుమార్ ప్రసాద్ చెప్పారు. అన్ని జిల్లాల కలెక్టర్లతో బుధవారం అమరావతి నుంచి ఆయన వీక్షణ సమావేశం నిర్వహించారు. తిరంగా యాత్ర కార్యక్రమాలు అన్ని ప్రాంతాలలో నిర్వహించాలని రాష్ట్ర ముఖ్య కార్యదర్శి చెప్పారు. ఈ సమావేశంలో బాపట్ల జిల్లా కలెక్టర్, ఇతర శాఖల అధికారులు పాల్గొన్నారు.