బాపట్ల మండలం సంగుపాలెం గ్రామంలో గురువారం పల్లె పండుగ వారోత్సవాల కార్యక్రమం జరిగింది. మండల తెలుగు మహిళ అధ్యక్షురాలు డాక్టర్ సౌపాటి గ్లోరీ యానెట్, పార్టీ శ్రేణులు పాల్గొని సీసీ రోడ్డు నిర్మాణానికి భూమి పూజ చేశారు. అనంతరం డాక్టర్ సౌపాటి గ్లోరీ యానెట్ మాట్లాడుతూ గత ప్రభుత్వంలో పల్లెలు అభివృద్ధికి నోచుకోలేదని కూటమి ప్రభుత్వం 4 నెలల కాలంలోనే పలు అభివృద్ధి కార్యక్రమాలు ప్రారంభించిందని పేర్కొన్నారు.