పిట్లవానిపాలెం మండలం చందోలు గ్రామంలోని బంగళాముఖి అమ్మ వారి దేవస్థానంలో బాపట్ల జనసేన పార్టీ సమన్వయకర్త నామన వెంకట శివన్నారాయణ పార్టీ శ్రేణులతో కలిసి తిరుమలలోని శ్రీవారి లడ్డు విషయంలో జరిగిన అపరాధానికి డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ చేపట్టిన 11రోజుల ప్రాయశ్చిత్త దీక్షకు సంఘీభావం తెలుపుతూ ఆలయంలో పూర్ణాహుతి హోమం చేసి ప్రత్యేక పూజలు నిర్వహించారు. బాపట్ల బీజేపీ సభ్యులు కొట్రా రామకృష్ణ పలువురు పాల్గొన్నారు.