కేంద్ర ప్రభుత్వం అమరావతి కి ప్రత్యేక రైల్వే లైన్ మంజూరు చేస్తూ రూ. 2245 కోట్లు కేటాయించడం హర్షణీయమని పట్టణ బీజేపీ అధ్యక్షుడు మామిడి రమేష్ కుమార్ అన్నారు. శుక్రవారం పట్టణంలో బిజెపి శ్రేణులతో కలిసి ఆయన మీడియాతో మాట్లాడారు. రైల్వే లైన్ మంజూరు చేయడం పట్ల ప్రధాని నరేంద్ర మోదీ , రైల్వే మంత్రి అశ్విని వైష్ణవ్ లకు కృతజ్ఞతలు తెలిపారు. రాష్ట్ర అభివృద్ధి కోసం కూటమి సర్కారు చిత్తశుద్ధి తో పని చేస్తుందని అన్నారు.