సరదాగా ఏమో కానీ ఓ యువకుడు రైలు బోగీలో ప్రయాణించవలసింది పోయి రైలు ఇంజన్ పై ఎక్కి ప్రయాణించిన ఘటన చీరాల-బాపట్ల స్టేషన్ల మధ్య జరిగింది. శనివారం చీరాలలో ఇంటర్ సిటీ రైలు విజయవాడకు బయలుదేరుతుండగా ఓ యువకుడు ఇంజనుపైకి ఎక్కి బాపట్ల వరకు ప్రయాణించాడు. మార్గ మధ్యలో చూసిన ప్రజలు రైల్వే పోలీసులకు సమాచారం ఇవ్వడంతో రైలు ను బాపట్ల స్టేషన్ లో ఆపి యువకుడిని కిందకి దించారు. బాపట్ల రైల్వే పోలీసులు విచారిస్తున్నారు.