బాపట్ల పట్టణంలోని సూర్యలంక రోడ్డులో గురువారం బాపట్ల పట్టణ పోలీసులు , ట్రాఫిక్ పోలీసులు సంయుక్తంగా వాహనాలు తనిఖీలు చేశారు. లైసెన్స్ లేకుండా, హెల్మెట్ ధరించకుండా, స్పీడ్ డ్రైవింగ్ చేసే వారిని గుర్తించి అపరాధ రుసుం విధించారు. వాహన చోదకులు ఎటువంటి పత్రాలు లేకుండా వాహనాన్ని నడపరాదని, మైనర్లు వాహనాలు నడపరాదని బాపట్ల ఎస్సై సుధాకర్ హెచ్చరించారు. 12 వాహనాలను సీజ్ చేసినట్లు ఆయన పేర్కొన్నారు.