భట్టిప్రోలు: రూ.60లక్షలతో అభివృద్ధి పనులకు శంకుస్థాపన
భట్టిప్రోలు మండలంలోని భట్టిప్రోలు గ్రామంలో శుక్రవారం పల్లె పండుగ కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ఎమ్మెల్యే ఆనందబాబు పాల్గొని 60 లక్షల రూపాయల అంచనాలతో సీసీ రోడ్ల నిర్మాణానికి శంకుస్థాపన చేశారు. వెంటనే పనులు చేపట్టాలని ఆయన గుత్తేదారులకు సూచించారు. నాణ్యతలో ఎక్కడ రాజీ పడవద్దని ఎమ్మెల్యే ఆనందబాబు తెలియజేశారు. వైసిపి పాలనలో రోడ్లు అస్తవ్యస్తంగా మారాయని ఆయన విమర్శించారు.