కాలువలో యువకుడి మృతదేహం కలకలం
పల్నాడు జిల్లా, బొల్లాపల్లి మండలంలో ఓ యువకుడు మృతదేహం బుధవారం కలకలం రేపింది. గమనించిన స్థానికులు వెంటనే బ్రిడ్జి తండా వద్ద సాగర్ కుడి కాల్వలో కొట్టుకువస్తున్న మృతదేహాన్ని బయటకు తీసే ప్రయత్నం చేశారు. చిన కెనాల్ మధ్యలో నీటి ఉద్ధృతికి మృతదేహాన్ని తీయడం సాధ్యం కాలేదని స్థానికులు అన్నారు. ఘటనపై మరింత సమాచారం తెలియాల్సి ఉంది.