కూటమి ప్రభుత్వం ఇచ్చిన హామీ మేరకు పేదలకు ఇళ్ల స్థలాలు కేటాయించాలని శుక్రవారం సీపీఐ ఏరియా ఇన్ చార్జ్ కార్యదర్శి తాళ్లూరి బాబురావు డిమాండ్ చేశారు. పేదలకు స్థలాలు ఇవ్వాలని డిమాండ్ చేస్తూ శుక్రవారం చిలకలూరిపేట తహశీల్దార్ కార్యాలయం ఎదుట ఆందోళన నిర్వహించారు. పెరిగిన ధరల దృష్ట్యా పేదల గృహ నిర్మాణానికి రాష్ట్ర ప్రభుత్వం రూ. ఐదు లక్షల ఆర్థిక సాయం చేయాలని డిమాండ్ చేశారు.