చిలకలూరిపేటలో దివంగత వంగవీటి మోహనరంగా 36వ వర్ధంతి సందర్భంగా గురువారం ఆయన చిత్రపటానికి మాజీ మంత్రి విడదల రజిని పూలమాలలు వేసి నివాళులర్పించారు. ఈ సందర్భంగా పార్టీ కార్యకర్తలతో ఆమె మాట్లాడుతూ ప్రజల మసస్సుల్లో చిరస్థాయిగా నిలిచిన అతికొద్ది మంది నేతలలో వంగవీటి మోహన రంగా ముందు వరుసలో ఉంటారని అన్నారు. రంగా సేవలు నేటి యువతకు ఆదర్శమన్నారు.