పేద ప్రజలకు అందాల్సిన రేషన్ బియ్యాన్ని అక్రమంగా రవాణ చేస్తున్న వాహనాన్ని విజిలెన్స్ అండ్ ఎన్‌ఫోర్స్ మెంట్ అధికారులు పట్టుకున్నారు. విశ్వసనీయ సమాచారంతో సోమవారం తెల్లవారు జామున మండలంలోని గంగన్నపాలెం గ్రామ శివార్లలో రేషన్ బియ్యంతో ఉన్న లారీని సోదా చేశారు. 112 బస్తాల్లో రేషన్‌బియ్యంతో పాటు మరో 21 ప్లాస్టిక్ గోతాలలో ఉన్న బియ్యాన్ని, లారీని స్వాధీనం చేసుకున్నారు.