
చిలకలూరిపేట: తప్పనిసరిగా ఈకేవైసి నమోదు చేయించుకోవాలి
ఎడ్లపాడు మండల పరిధిలోని అన్ని గ్రామాలలో ఈకేవైసీ పెండింగ్లో ఉన్న రేషన్ కార్డ్ లోని కుటుంబ సభ్యులు ఈనెల 31లోపు తప్పనిసరిగా ఈకేవైసి నమోదు చేయించుకోవాలని తహసీల్దార్ విజయశ్రీ అన్నారు. లేకుంటే మరుసటి నెల రేషన్ కోల్పోతారని సోమవారం తెలిపారు. తహసీల్దార్ కార్యాలయంలో ఆమె మాట్లాడుతూ మండలంలో 5344 మందికి ఈకేవైసీ పెండింగ్లో ఉందని, సంబంధిత రేషన్ డీలర్ల వద్ద ఈకేవైసీ నమోదు చేయించుకోవచ్చన్నారు.