నాదెండ్ల మండలం బుక్కాపురం గ్రామానికి చెందిన కటారి శివ ఇటీవల పొలంలో పాముకాటుకు గురై నరసరావుపేట ఆసుపత్రిలోచికిత్స పొంది ప్రాణాపాయం నుంచి బయటపడింది. ఆమె ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న సమయంలో ఎం. ఆర్. ఫౌండేషన్ ఛైర్మన్ మల్లెల రాజేష్‌నాయుడు ఆసుపత్రికి వెళ్లి పరామర్శించారు. ప్రస్తుతం శివ ఇంటి వద్దనే ఉంటోంది. కూలి పనులకు వెళ్లి కుటుంబాన్ని పోషించుకునే శివ ఆర్థిక ఇబ్బందులు ఎదుర్కొనకూడదనే ఉద్ధేశంతో మల్లెల రాజేష్‌నాయుడు తన ఎంఆర్ ఫౌండేషన్ ద్వారా ఇరవై ఐదు వేల రూపాయలు(రూ. 25, 000) ఆర్థికసాయాన్ని ఫౌండేషన్ ప్రతినిధుల ద్వారా అందజేశారు. కార్యక్రమంలో బుక్కాపురం గ్రామ పెద్దలు పాల్గొన్నారు.