చిలకలూరిపేట శ్రీ దత్తసాయి అన్నదాన సమాజము మరియు జయ జయ సాయి ట్రస్ట్ ఆధ్వర్యములో కాలజ్ఞాన కర్త జగద్గురు శ్రీ వీరబ్రహ్మేంద్ర స్వామి వారి 330 వ ఆరాధన సందర్భముగా గోడ పత్రిక ఆవిష్కరించారు. ట్రస్ట్ చైర్మన్ పూసపాటి బాలాజి మాట్లాడుతూ సమాజంలో ఉన్న మూఢనమ్మకాలను రూపు మాపి భవిష్యత్ లో జరిగే సంఘటనలు కొన్ని వందల సంవత్సరం ల క్రితమే తెలియచేసిన మహానుబావుడని తెలిపారు. ఈ కార్యక్రమంలో పూసపాటి రవి, బహునాథం గోవిందచారి, బాల కొటేస్వరావు, బొప్పుడి వీరేశలింగం, సిద్దు సనత్, శివయ్య తదితరులు పాల్గొన్నారు.