నాదెండ్ల మండలం బుక్కాపురం గ్రామానికి చెందిన యర్రం అశోక్‌బాబు గతంలో రోడ్డు ప్రమాదానికి గురై తీవ్రగాయాలపాలై ఆసుపత్రిలో చికిత్స పొందాడు. ప్రస్తుతం ఇంటి వద్దనే మంచానికి పరిమితమై చికిత్స తీసుకుంటున్నాడు. విషయం తెలుసుకున్న ఎం. ఆర్. ఫౌండేషన్ ఛైర్మన్ మల్లెల రాజేష్‌నాయుడు ఇరవై వేల రూపాయలు(రూ. 20, 000లు) ఆర్థిక సాయాన్ని ఎం. ఆర్. ఫౌండేషన్ ప్రతినిధుల ద్వారా అశోక్‌బాబుకు అందజేశారు. కార్యక్రమంలో బుక్కాపురం గ్రామ పెద్దలు పాల్గొన్నారు.