యువకుడిని పరామర్శించిన మల్లెల రాజేష్ నాయుడు

2788చూసినవారు
యువకుడిని పరామర్శించిన మల్లెల రాజేష్ నాయుడు
చిలకలూరిపేట మున్సిపాలిటీ పరిధిలోని గణపవరం 1వ వార్డు రాజులవారి వీధికి చెందిన వంగపాటి మహేష్ ఇటీవల కావూరు సమీపంలో రోడ్డు ప్రమాదానికి గురై తీవ్రంగా గాయపడి నరసరావుపేటలోని అరవిందబాబు ఆసుపత్రిలో చికిత్సపొందుతున్నాడు. విషయం తెలుసుకున్న ఎంఆర్ ఫౌండేషన్ ఛైర్మన్ మల్లెల రాజేష్ నాయుడు శనివారం రాత్రి ఆసుపత్రికి వెళ్లి మహేష్ ను పరామర్శించి ప్రమాదానికి కారణాలు తెలుసుకుని ధైర్యం చెప్పారు. వైద్యునితో మాట్లాడి మహేష్ ఆరోగ్య పరిస్థితి తెలుసుకున్నారు. తక్షణసాయంగా వైద్యఖర్చుల నిమిత్తం పదివేల రూపాయలు(రూ. 10, 000లు) ఆర్థికసాయం అందజేశారు. రాజేష్ నాయుడుగారి వెంట 1వ వార్డు కౌన్సిలర్ తులం సుధాకర్, ఎంఆర్ ఫౌండేషన్ ప్రతినిధులు ఉన్నారు.

ట్యాగ్స్ :

Job Suitcase

Jobs near you

సంబంధిత పోస్ట్