చిలకలూరిపేట పట్టణానికి చెందిన సీనియర్ తెలుగుదేశం పార్టీ నాయకులు అబూ సాలేహ బుధవారం కన్నుమూశారు. వారి భౌతిక కాయాన్ని స్థానిక పదో వార్డులో టీడీపీ నాయకులు, బంధుమిత్రుల సందర్శనార్థం కుటుంబ సభ్యులు ఉంచారు. ఆయన మరణం తెలుసుకొని ఎమ్మెల్యే పత్తిపాటి పుల్లారావు విచారం వ్యక్తం చేశారు. మరణం పట్ల సంతాపాన్ని కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతిని ప్రకటించారు. పార్టీకి అందించిన సేవలను ఎమ్మెల్యే గుర్తు చేశారు.