వేటపాలెం మండలం పందిళ్ళపల్లి గ్రామంలో శిథిలావస్థకు చేరిన ప్రభుత్వ వైద్యశాలను మరలా నిర్మించాలని గ్రామానికి చెందిన రాంబాబు చేపట్టిన రిలే నిరాహార దీక్ష మంగళవారం నాలుగోవ రోజుకు చేరింది. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఎన్నికల్లో ఎమ్మెల్యే ఇచ్చిన హామీని విస్మరించాడని అన్నారు. నియోజకవర్గస్థాయి సమీక్ష సమావేశంలో వైద్యశాల ప్రస్తావన రాకపోవటం బాధాకరమని రాంబాబు పేర్కొన్నారు.