'మొసలి లేదు.. ఆందోళన చెందవద్దు

76చూసినవారు
మార్టూరు మండలంలోని రాజుపాలెం చెక్ డ్యాంలో మొసలి కనిపించిందంటూ స్థానికులు ఆందోళన వ్యక్తం చేయడంతో గురువారం సిఐ శేషగిరిరావు, అటవీ శాఖ అధికారి రమేష్ లు ఆ ప్రాంతాన్ని సందర్శించి అన్ని కోణాల్లో పరిశీలించారు. అయితే చెక్ డ్యామ్ లో మొసలి ఆనవాళ్లు లేవని వారు స్పష్టం చేశారు. ఎవరూ ఆందోళన చెందనవసరం లేదన్నారు. అత్యవసరమైతే రెస్క్యూ టీం ని పంపుతామని కూడా వారు స్థానికులకు భరోసా ఇచ్చారు. దీంతో స్థానికులు ఊరడిల్లారు.

సంబంధిత పోస్ట్