Sep 21, 2024, 03:09 IST/
58 మందితో అక్రమ సంబంధాలు పెట్టుకున్న అధికారిణికి 13 ఏళ్ల జైలు శిక్ష విధించిన చైనా కోర్టు
Sep 21, 2024, 03:09 IST
అధికారాన్ని అడ్డం పెట్టుకుని అక్రమాలకు పాల్పడుతూ, 58 మందితో అక్రమసంబంధాలు పెట్టుకుని నైతికతకు తిలోదకాలు ఇచ్చేసిన ఓ చైనా అధికారిణికి తాజాగా 13 ఏళ్ల కారాగార శిక్ష, 1.4 లక్షల డాలర్ల జరిమానా విధించారు. అవివాహిత అయిన అధికారిణి జాంగ్ యాంగ్(52) రాజకీయ భవిష్యత్తు కోసం చైనాలో అనేక దారుణాలకు తెగబడింది. కింది స్థాయి ఉద్యోగులు అనేక మందితో అక్రమ సంబంధాలు పెట్టుకుంది. ఆమెతో కలిగే ప్రయోజనాల కోసం కొందరు, ఆమె భయానికి మరికొందరు లొంగిపోయారు.