గుంటూరు నగర పాలక సంస్థ నిర్వహిస్తున్న సంక్రాంతి సంబరాల్లో ప్రజలు విరివిగా పాల్గొని జయప్రదం చేయాలని కమిషనర్ పులి శ్రీనివాసులు సోమవారం పిలుపునిచ్చారు. వేడుకల్లో భాగంగా 13 నుంచి 15వ తేదీ వరకు భోగి, సాంస్కృతిక కార్యక్రమాలు, గంగిరెద్దులు, హరిదాసుల ప్రదర్శనలు, ఫోక్ డాన్స్, తదితర అంశాలను ప్రత్యేకంగా డిజైన్ చేసి ప్రదర్శించడం జరుగుతుందని తెలిపారు.