తమ సమస్యలను అధికారులకు వివరించిన పట్టించుకోవడంలేదని విభిన్న ప్రతిభావంతులు గుంటూరు జిల్లా కలెక్టర్ వద్ద సోమవారం వేడుకున్నారు. దివ్యాంగులకు కావాల్సిన వీల్ ఛైర్లు, బ్యాటరీ వాహనాలను, చెక్క కర్రలు, వినికిడి యంత్రాలను అందించాలని దివ్యాంగులు కోరారు. దివ్యాంగుల సమస్యల పరిష్కారానికి చర్యలు తీసుకుంటానని గుంటూరు జిల్లా కలెక్టర్ నాగలక్ష్మి వారికి భరోసా కల్పించారు.