గుంటూరు రేంజి పరిధిలో రౌడీ షీటర్ల పై నిఘా పెట్టాలని ఐజీ త్రిపాటి అధికారులను ఆదేశించారు. మంగళవారం తన కార్యాలయంలో శాంతిభద్రతల పరిరక్షణ, తీవ్ర నేరాల కేసులకు సంబంధించి సమీక్ష సమావేశం నిర్వహించారు. ఆధునిక పరిజ్ఞానం ఉపయోగించి కేసులు త్వరితగతిన దర్యాప్తు చేయాలన్నారు. సమావేశంలో గుంటూరు, ప్రకాశం, నెల్లూరు, బాపట్ల, పల్నాడు జిల్లాల ఎస్పీలు పాల్గొన్నారు.