నేటి నుంచి మిర్చి యార్డులో క్రయవిక్రయాలు

83చూసినవారు
నేటి నుంచి మిర్చి యార్డులో క్రయవిక్రయాలు
గుంటూరు మిర్చి మార్కెట్ యార్డులో సోమవారం నుంచి యథావిధిగా మిర్చి క్రయవిక్రయాలు జరుగుతాయని మార్కెట్ యార్డు కార్యదర్శి ఐ. వెంకటేశ్వరరెడ్డి తెలిపారు. ఎండ తీవ్రత కారణంగా మే నెల 11 నుంచి జూన్ 9 వరకు యార్డుకు సెలవులు ప్రకటించామని, సుమారు నెల రోజుల అనంతరం యార్డులో క్రయవిక్రయాలకు అనుమతిచ్చినట్లు వెల్లడించారు. మిర్చి రైతులు తమ సరుకును ఆదివారం నుంచి అమ్మకాలకు ఏర్పాట్లు చేసినట్లు పేర్కొన్నారు.

సంబంధిత పోస్ట్