క్షేత్రస్థాయి సిబ్బంది సహకారంతో శాంతిభద్రత సమస్యలను పరిష్కరించాలని గుంటూరు ఎస్పీ సతీశ్ కుమార్ సూచించారు. వార్షిక తనిఖీల్లో భాగంగా మంగళవారం పట్టాభిపురం పోలీస్ స్టేషన్ ను ఎస్పీ తనిఖీ చేశారు. ఈ సందర్భంగా రికార్డులను పరిశీలించి సిబ్బంది పనితీరను స్వయంగా పరిశీలించారు. మహిళా ఫిర్యాదిదారుల కోసం ప్రత్యేక వెయిటింగ్ రూమ్ ను ఏర్పాటు చేయాలని, పెండింగ్ వాహనాలను త్వరగా డిస్పోస్ చేయాలని ఆదేశించారు.