మార్కెట్ లో సౌకర్యాలు మెరుగుపరచాలి

62చూసినవారు
గుంటూరులోని మున్సిపల్ కార్పొరేషన్ కార్యాలయం పక్కన ఉన్న వెన్ లాక్ మార్కెట్ సమస్యలకు నెలవుగా మారింది. కొన్నేళ్ల నుంచి ఎలాంటి సౌకర్యాలు లేక వ్యాపారులు ఇబ్బందులు పడుతున్నారు. ప్రత్యేకించి వర్షాకాలంలో తమ బాధ మరింత ఉందని వారు వాపోయారు. శనివారం కురిసిన వర్షానికి మార్కెట్ మొత్తం నీటి కుంటలా మారిందన్నారు. ఇప్పటికైనా పాలకులు స్పందించి తమకు సౌకర్యాలు మెరుగుపరచాలని వ్యాపారులు కోరుతున్నారు.

సంబంధిత పోస్ట్