గుంటూరు: బోరుగడ్డ అనిల్ కు 7 రోజుల రిమాండ్

79చూసినవారు
గుంటూరు: బోరుగడ్డ అనిల్ కు 7 రోజుల రిమాండ్
వైసీపీ అభిమాని బోరుగడ్డ అనిల్ కు బుధవారం శ్రీకాకుళం మొబైల్ కోర్టు ఇంఛార్జ్ భరణి 7 రోజుల పాటు రిమాండ్ విధిస్తూ తీర్పు చెప్పారు. చంద్రబాబు, పవన్ కల్యాణ్ పై గతంలో అనిల్ చేసిన విమర్శలపై కేసు నమోదవ్వడంతో పోలీసులు కోర్టులో హాజరు పరిచారు. ఈ నేపథ్యంలో భరణి రిమాండ్ విధిస్తూ తీర్పునిచ్చారు. ఓవ్యక్తిని బెదిరించిన కేసులో ఇప్పటికే అనిల్ రాజమండ్రి జైలులో ఉన్నారు. తీర్పు తర్వాత తిరిగి అనిల్ ను జైలుకు తరలించారు.

సంబంధిత పోస్ట్