మాజీ మంత్రి అంబటి రాంబాబు పవన్ కల్యాణ్‌కు పరిపాలన చేతకాదని విమర్శించారు. గుంటూరులోని పార్టీ కార్యాలయంలో మంగళవారం మాట్లాడిన ఆయన, కూటమి మొత్తం కట్టకట్టుకొని ఉన్నా ప్రజలు కూకటి వేళ్లతో పెకిలిస్తారని జోస్యం చెప్పారు. ఆవేశంతో ఊగిపోతే ప్రజలకు ఎటువంటి మేలు జరగదని తెలిపారు. పిఠాపురంలో, తెనాలిలో కూటమి నాయకులు మహిళలపై దాడులు చేస్తే పవన్ కల్యాణ్ ఎందుకు ప్రశ్నించలేదని ప్రశ్నించారు.