పిడుగురాళ్ల టౌన్ అయ్యప్ప స్వామి టెంపుల్ భారత్ పెట్రోల్ బంక్ ఎదురుగా బుధవారం రాత్రి రోడ్డు ప్రమాదం జరిగింది. ద్విచక్ర వాహనంపై వెళ్తున్న వ్యక్తి అదుపుతప్పి డివైడర్ను ఢీ కొట్టాడు. ఈ ఘటనలో బైక్పై ఉన్న వ్యక్తికి తీవ్ర గాయాలయ్యాయి. క్షతగాత్రుడిని చికిత్స నిమిత్తం స్థానిక ఆసుపత్రికి తరలించారు. ఈ ఘటనపై స్థానికులు పిడుగురాళ్ల టౌన్ సీఐ సమాచారం అందజేశారు. పోలీసులు ఘటనపై విచారణ చేస్తున్నారు.