ఆంధ్రప్రదేశ్ శాసనసభ డిప్యూటీ స్పీకర్ గా ఏకగ్రీవంగా ఎన్నికైన ఉండి శాసనసభ్యులు రఘురామకృష్ణం రాజును గురజాల ఎమ్మెల్యే యరపతినేని శ్రీనివాసరావు అభినందించారు. స్పీకర్ స్థానంలో కూర్చున్న రఘురామను కలిసి శుభాకాంక్షలు తెలిపారు. వెలగపూడిలోని సచివాలయంలో డిప్యూటీ స్పీకర్గా రఘురామకృష్ణం రాజు ఏకగ్రీవంగా ఎన్నికైనట్లు స్పీకర్ అయ్యన్నపాత్రుడు ప్రకటించిన సంగతి తెలిసిందే.