గురజాల నియోజకవర్గంలోని మాచవరం మండలంలో మూడు రోజులుగా భారీగా కురుస్తున్న వర్షాలకు పిల్లుట్ల సమీపంలోని పీల్లేరు వాగు, పిన్నెల్లిలోని కొట్టేళ్ల వాగు, వేమవరంలోని చాకిరేవు వాగు పొంగి ప్రవహించడంతో మాచవరానికి ఆదివారం రాకపోకలు నిలిచిపోయాయి. దీంతో ప్రజలు తీవ్ర ఇబ్బందులకు గురవుతున్నారు. ఇప్పటికే ఆయా గ్రామాల్లో వాగుల వద్ద ఎస్సై సతీశ్ ప్రత్యేక పోలీస్ బలగాలని ఏర్పాటు చేశారు. ఎవరూ బయటకు రావద్దని హెచ్చరికలు చేశారు.