కారంపూడి: ఉద్యోగం మానుకోమని అధికారులు బెదిరిస్తున్నారు: కాశీ
తనను ఉద్యోగం మానుకోవాలని అధికారులు బెదిరిస్తున్నారని కారంపూడి మండలంలోని గాదెవారిపల్లి విద్యుత్ సబ్ స్టేషన్ ఒప్పంద కార్మికుడు ఆవుల మంద వెంకట కాశిరావు సోమవారం ప్రజావాణిలో ఫిర్యాదు చేశారు. తనపై ఎటువంటి ఆరోపణలు లేనప్పటికీ గురజాల డిప్యూటీ డివిజనల్ ఇంజనీర్ మారం శ్రీనివాస్ రావు కారంపూడి సెక్షన్ లో పనిచేస్తున్న సీతారామాంజనేయులు వేధిస్తున్నారని కలెక్టర్ కు ఇచ్చిన ఫిర్యాదులో పేర్కొన్నారు.