వేపకంపల్లెలో సీసీ రోడ్లకు భూమి పూజ చేసిన ఎమ్మెల్యే
కారంపూడి మండల పరిధిలోని వేపకంపల్లే గ్రామంలో జాతీయ ఉపాధి హామీ పథకం ద్వారా నిర్మిస్తున్న సిమెంటు రోడ్లకు మాచర్ల ఎమ్మెల్యే జూలకంటి బ్రహ్మారెడ్డి ఆదివారం భూమి పూజ నిర్వహించి పనులు ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ పల్లెలు అభివృద్ధి చెందుతున్నప్పుడే దేశం అభివృద్ధి చెందుతుందని ఆయన అన్నారు. ఈ కార్యక్రమంలో మండల పరిషత్ అభివృద్ధి అధికారి శ్రీనివాస్ రెడ్డి, తెలుగుదేశం పార్టీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.