కర్లపాలెం: లోతట్టు ప్రాంతాల ప్రజల ఆవేదన
కర్లపాలెం మండలంలో 4రోజుల నుంచి ఏకధాటిగా పడుతున్న వర్షానికి మండలంలోని పాతూరులో నీళ్లు నిలిచిపోయాయి. దీంతో పల్లె వాసులు అవస్థలు పడుతున్నారు. ఎన్నిసార్లు చెప్పినా అధికారులు స్పందించకపోవడంతో వారే పాతూరు మసీదు దగ్గర నుంచి పోలీస్ స్టేషన్ వరకు సైడ్ కాలువలు తవ్వి, పైప్ లైన్ ల ద్వారా పంట కాలువకు నీళ్లు మళ్లిస్తున్నారు. అధికారులు స్పందించి నీరు పోయే మార్గం చూడాలని పల్లె వాసులు కోరుతున్నారు.