కర్లపాలెం మండలంలో శుక్రవారం సాయంత్రం జోరు వర్షం మొదలయింది. వారం రోజులుగా ఎలాంటి వర్షం లేకపోవడంతో వేరుశనగ రైతులు సాఫీగా పంట ఎండపెట్టారు. ఇప్పుడు వర్షం రావడంతో చేతికి వచ్చిన పంట ఎలా ఆరబెట్టాలోనని ఆందోళన చెందుతున్నారు. అసలే పంటకు సరైన గిట్టుబాటు ధర లేకపోవడం, అధిక వర్షపాతం దిగుబడి సరిగ్గా లేకపోవడంతో రైతులు ఆందోళన చెందుతున్నారు.