కర్లపాలెం మండలం పెద్ద గొల్లపాలెం గ్రామపంచాయతీ పరిధిలోని నక్కలవారిపాలెంలో ఆదివారం మాజీ ముఖ్యమంత్రి స్వర్గీయ ఎన్టీ రామారావు విగ్రహాన్ని బాపట్ల ఎమ్మెల్యే వేగేశన నరేంద్ర వర్మ ఆవిష్కరించారు. అనంతరం ఏర్పాటు చేసిన సభలో ఆయన మాట్లాడుతూ దేశ రాజకీయ చరిత్రలో అన్న ఎన్టీఆర్ ఒక మహోన్నత వ్యక్తి అని ఆయన సంక్షేమ పథకాలు దేశానికే ఆదర్శమని కొనియాడారు.ఈ కార్యక్రమంలో పెద్ద సంఖ్యలో కూటమి శ్రేణులు పాల్గొన్నారు.